ముస్లిం యువకుడిపై హిందూ యువకులు దాడి

ప్రేమకు మతం లేదు...మానవత్వానికి మతం లేదు. వాటికి తెలిసిందల్లా ప్రేమను పంచడం...సాయం చేయడం. ఉత్తరాఖండ్‌లో ఈ రెండు సంఘటనలు ఏక కాలంలో జరిగాయి. హిందూ యువతిని ప్రేమిస్తున్నందుకు ముస్లిం యువకుడిపై దాడికి దిగారు హిందూ యువకులు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌, రామ్‌పూర్‌ గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో జరిగింది. ఈ గొడవ గురించి  ఆ ఏరియా పోలీసధికారి గంగాదీప్‌ సింగ్‌కు సమాచారం అందించారు స్థానికులు. సింగ్‌ ఆ ప్రదేశానికి చేరుకునే సరికి హిందూ యువకులు ముస్లిం యువకుడిని కొట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ విషయం గమనించిన సింగ్‌ బాధిత యువకుడిని కాపాడటం కోసం ముందుకు వెళ్లి ఆ యువకుడికి అడ్డుగా నిలబడి కాపాడాడు. ఈ విషయాన్నంతా ఎవరో రికార్డు చేసి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా గంగాదీప్‌ సింగ్‌ను అభినందనలతో ముంచేత్తుతున్నారు. ‘పోలీస్‌ సాబ్‌ మానవత్వానికి మతంతో పని లేదని చాటారు...మీరు సూపర్‌ సార్‌’ అని కామెంట్‌ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top