చెల్లితో ప్రియాంకారెడ్డి చివరి ఫోన్‌కాల్
‘భయమవుతోంది పాప నాకు. ప్లీజ్ కొంచెం సేపు మాట్లాడు’ అంటూ ప్రియాంకారెడ్డి ఫోన్లో చివరిసారిగా తన సోదరితో మాట్లాడింది. వాళ్లను చూస్తుంటే భయమవుతోందని, ఏడుపు వస్తోందని తన సోదరితో దీనంగా చెప్పింది. రాత్రిపూట రోడ్డు మీద ఒక్కదాన్నే ఉన్నానని, చాలా టెన్షన్‌గా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. కొంచెంసేపు తనతో మాట్లాడాలని సోదరిని ఫోన్లో కోరింది. తన స్కూటీ వెనుక టైరు పంక్చర్ కావడంతో అక్కడ ఉన్న లారీలోంచి ఓ వ్యక్తి వచ్చి పంక్చర్ వేయించుకొస్తానని బండి తీసుకెళ్లాడని ప్రియాంక చెప్పింది. తాను వెళ్లిపోతానంటే వద్దని తన వెంటబడ్డాడని భయంగా చెప్పింది. సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు వెళ్లాలని ప్రియాంకకు సోదరి సూచించగా అక్కడ నిలబడితే అందరూ తననే చూస్తారని సమాధానం ఇచ్చింది. ‘చాలా భయంగా ఉంది. ఈ దెయ్యం మొహపోడు నా బండి ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ అస్సలు నిలబడాలని లేదు. బైక్ వచ్చే వరకు కాసేపు మాట్లాడు’ అంటూ సోదరితో ఫోన్లో మాట్లాడింది.
సంబంధిత వార్తలు...
నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి
అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు