దగ్గరవుతున్న పెథాయ్‌ ముప్పు ..

పెథాయ్‌ తుఫాను వేగంగా కాకినాడ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) పలు హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను కాకినాడ‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉందని తెలిపింది. తుపాను తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోందని, గంట‌కు 19 కిలోమీట‌ర్ల వేగంతో క‌దులుతున్న తుపాను ఈరోపు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మ‌ధ్య తీరం దాట‌నుందని వెల్లడించింది. గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన బ‌ల‌మైన గాలుల‌తో పెథాయ్‌ తీరం దాట‌నుందని తెలిపింది. తూర్పుగోదారి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయని.. తూర్పుగోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు గోదావ‌రి జిల్లాల్లో గంట‌కు 110 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురు గాలులు  వీస్తాయని పేర్కొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top