ప్రగతి నివేదన సభ: హృదయవిధారక ఘటన

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌ శివార్లలోని కొంగరకలాన్‌లో తలపెట్టిన ప్రగతి నివేదన సభ ప్రాంగణానికి సమీపంలోనే హృదయవిధారక సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి రోడ్డు పక్కన పడి ఉన్నా అటుగా వెళుతున్న ఏ ఒక్కరూ స్పందించలేదు.వివరాలు.. సెల్ఫ్‌ డ్రైవింగ్ చేస్తు వెళుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ బైక్‌(టీఎస్‌ 07 ఎఫ్‌ఆర్‌ 6346)పై నుంచి పడిపోయారు. ప్రగతి నివేదన సభకు సమీపంలోనే రావిరాల దారిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 108కి దాదాపు 100కు పైగా ఫోన్‌లు చేసినా స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు. గంటన్నరకు పైగా ప్రగతి నివేదన సభకు వెళ్లే వాహనాలను సహాయం చేయమని అడిగినా ఎవరినుంచి సరైన స్పందనరాలేదని పేర్కొన్నారు. చివరకు చేసేదేమీలేక సంతోష్‌ నగర్‌ పీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అబేద్‌ హుస్సేన్‌, కానిస్టేబుల్‌లు నవీన్‌, మధుసూదన్‌లు, స్థానికుల సహకారంతో ట్రాఫిక్‌ వాహనంలోనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో రక్తం బాగా పోవడంతో ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి గురైన వ్యక్తి  మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top