రేవంత్ రెడ్డి అరెస్ట్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈసీ ఆదేశాలతో మంగళవారం తెల్లవారుజామున 4గంటలకు రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి తొలుత రేవంత్‌ను హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించిన పోలీసులు.. ఆ తర్వాత తెల్లవారుజామున ఇంటి తలపులు పగులగొట్టి అరెస్ట్ చేశారు. రేవంత్‌తో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిని, ప్రధాన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆనంతరం రేవంత్‌ను జడ్చర్ల ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది. కోస్గి, కొడంగల్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. రేవంత్ అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు