ప్రియాంక హత్య: హెల్ప్‌.. హెల్ప్‌ అన్నా వదిలిపెట్టలేదు

ప్రియాంకారెడ్డి హత్య కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలువెలుగులోని వచ్చాయి. బైక్‌ టైర్‌ పంక్చర్‌ చేపిస్తామని స్కూటీని తీసుకెళ్లిన ఆరిఫ్‌ అంతకీ రాకపోవడంతో ప్రియాంక తన మొబైల్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ప్రియాంక రెడ్డి ఫోన్‌ ఆధారంగా మహమ్మద్ ఆరిఫ్‌ ఆచూకీని పోలీసులు కనుకున్నారు. దీంతో కేసు విచారణలో ప్రియాంక ఫోన్‌ కీలక ఆధారంగా మారింది.  రిమాండ్‌ రిపోర్టులో పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిందితులు ప్రియాంకను బలవంతంగా తీసుకెళ్లే సమయంలో.. హెల్ప్ హెల్ప్ అని వేడుకున్నా నిందితులు కనికరించలేదు. బలవంతంగా ఆమె నోట్లో మద్యం పోసి అత్యాచారం జరిపి.. రాక్షసానందం పొందారు.  ఒకరి తరువాత ఒకరు బాధితురాలిపై అత్యాచారం జరిపినట్లు రిపోర్టులో తేలింది. బుధవారం రాత్రి 9.30 నుండి 10.20 వరకు కీచకులు ఈ దారుణకాండ కొనసాగించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top