గత పాలకులు వంశధార ప్రాజెక్టు నిధులను స్వాహా చేశారు
ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వంశధార ప్రాజెక్టును ప్రారంభించారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గుర్తుచేశారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ హయంలో 80 శాతం భూసేకరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వంశధార ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి