పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత అరుణ

సాక్షి, రాజమండ్రి : మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్‌ చీఫ్‌ చలపతి భార్య అరుణను అంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతవారం జరిగిన గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్‌కౌంటర్‌లో గాయపడిన అరుణ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరుణతో పాటు గాయపడిన మరో మావోయిస్టు సభ్యురాలు భవానీ పెడబయలు దళానికి చెందని సభ్యురాలిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన భవానీని కూడా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆస్పత్రికి తరలించి ఆమెకు వైద్యం అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కోలుకోవడంతో విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్‌ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. 

ఇక గతవారం గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు అరుణ కూడా ఉన్నట్లు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. అయితే అరుణ ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. కానీ ఆ వార్తలు అవాస్తమని పోలీసులు తేల్చిచెప్పారు. అయితే ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన  మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆరుణ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top