కాశీంను సీజే ముందు హాజరుపరిచిన పోలీసులు

: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చింతకింద కాశీంను ఆదివారం ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్ ముందు హాజరుపరిచారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ శనివారం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి గజ్వేల్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీనిపై పౌరహక్కల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టిన సీజే ఆదివారం ఉదయం తమ ఎదుట హాజరుపర్చాలని తెలంగాణ పోలీసులను ఆదేశించారు. సీజే ఆదేశాల మేరకు పోలీసులు కాశీంను సీజే ఇంటిముందు హాజరుపరిచారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top