శభాష్ పోలీస్
‘దిశ’కేసు నిందితుల ఎన్కౌంటర్ తర్వాత శుక్రవారం ప్రజలు చటాన్‌పల్లి వద్ద పోలీసులపై పూల వర్షం కురిపించారు. పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. గత నెల 30న నిందితులను పోలీసులు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా స్థానికులు వేలసంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకుని నిందితులకు బహిరంగంగా ఉరి తీయాలి..లేని పక్షంలో తమకు అప్పగించాలని కోరుతూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు వారిపై రాళ్లు విసిరారు. అందులో ఓ నిరసనకారుడు పోలీసులపై చెప్పు కూడా విసిరాడు. కాగా, శుక్రవారం నిందితులను పోలీసులు చటాన్‌పల్లి సమీపంలో ఎన్కౌంటర్ చేయడంతో అదే చేతులతో వారిపై స్థానికులు పూలు చల్లారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు