అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

పెద్దపల్లి  జిల్లాలో  బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి -అడవిశ్రీరాంపూర్ సమీపంలో  ఇవాళ ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కింద పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప‍్రమాదంలో  పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... మంథని నుండి ముత్తారం మండలంలోని పలు గ్రామాల విద్యార్థులను దర్యాపూర్ మోడల్ స్కూల్‌కు తీసుకువెళ్లే ఈ ప్రమాదం జరిగింది. సింగిల్ రోడ్డు కావడంతో డ్రైవర్  అజాగ్రత్త వల్ల బస్సు రోడ్ కిందికి దూసుకెళ్లింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top