'సీఎంగారూ.. మీది రాజకీయ వ్యభిచారం కాదా?'

సీఎం చంద్రబాబుగారూ.. మీరు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మీరు కాదా? అంటూ మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు సీఎంకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘‘తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో కేసీఆర్‌ తన్ని తరిమేస్తే అమరావతికి పారిపోయి వచ్చి ఇక్కడ సభలు నిర్వహించి ఆ వేదికపై నుంచి కేసీఆర్‌పై ఊకదంపుడు ఉపన్యాసమిచ్చి, ఖబడ్దార్‌ అని హెచ్చరించి.. ఈరోజు తమరు చేస్తున్న ఇంగ్లిషు కిస్సుల మాటేమిటి? ఇది రాజకీయ వ్యభిచారం కాదా? ఈరోజు అమెరికాకు వెళ్లింది, కుల మీటింగులు పెట్టుకుని కుల ప్రచారం చేస్తున్నది మీరు కాదా? అదే కుల మీటింగులు ఇతరులు పెట్టుకుంటే మీకెందుకు కోపం వస్తోంది?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘కులాలవారీగా సమావేశాలు పెట్టి ఎన్నో ఆశలు కల్పించారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే.. మీరు స్వస్థత కోల్పోయి నేను ఎక్కడ హామీలు ఇచ్చానంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top