రేపు తెలంగాణ మంత్రివర్గం విస్తరణ

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు మరికొన్ని గంటలే గడువుండడంతో నగర ఎమ్మెల్యేల్లో ‘హై’ టెన్షన్‌ మొదలైంది. ఎవరికి వారు ప్రగతిభవన్‌ నుంచి వచ్చే పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉత్కంఠకు లోనవుతున్నారు. గడిచిన కేబినెట్‌లో నగరం నుంచి ఏకంగా నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు. అయితే, మంగళవారం నాటి మంత్రివర్గ విస్తరణ పరిమితంగానే ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో కనీసం మరో ఇద్దరికైనా చాన్స్‌ దక్కుతుందని ఆశావహుల భావన.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top