ముషారఫ్ ఇంట్లో మికా సింగ్.. నెటిజన్ల ఆగ్రహం
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేశాక భారత్, పాక్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. భారత్‌పై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్‌తో వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడమేగాక పాక్‌లో బాలీవుడ్ సినిమాలపై నిషేదం విధించింది. కాగా, పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ కజిన్ కూతురి వివాహ కార్యక్రమం కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ పాల్గొన్నారు. ఆయన పాటలు పాడుతుండగా పలువురు హుషారుగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు