సింహంతో సర్కస్‌ షో.. చిన్నారిపై పంజా

సర‍్కస్‌లో విన్యాసాలు చేయాల్సిన సింహం ఓ చిన్నారిపై దాడి చేసింది. షో చూస్తున్న నాలుగేళ్ల చిన్నారిపై పంజా విసిరి అమాంతం తినేందుకు ప్రయత్నించింది. సిబ్బంది అప్రమత్తం కావడంతో చిన్నారి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. రష్యాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.రష్యాలోని క్రాస్‌నోడార్‌ నగరంలోని ఓ గ్రామంలో సింహంతో సర్కస్‌ షో నిర్వహించారు.  ప్రేక్షకులు షోను భలే ఎంజాయ్ చేస్తున్నారు. సింహం ఉన్న బోనులోకి వెళ్లిన ట్రెయినర్‌ దానితో ఫీట్లు చేయిస్తున్నాడు. షోకి వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారి కూడా ఆ సింహం చేస్తున్న విన్యాసాలు చూస్తూ చప్పట్లు కొడుతోంది. ఇంతలోనే ట్రేయినర్‌ దానితో మరో విన్యాసం చేయిద్దామని పక్కకి తీసుకొచ్చాడు. సింహం అలా నేలపై ఒరిగింది. ట్రేయినర్‌ ప్రేక్షకుల వైపు చూస్తూ ఎదో చెప్పబోతున్నాడు. అంతే వెంటనే పరుగెత్తి  బోను దగ్గరలో ఉన్న ఓ చిన్నారిపై పంజా విసిరింది. బోనులోపలకి లాక్కొచ్చి అమాంతం తినేందుకు ప్రయత్నించగా సిబ్బంది రక్షించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top