మర్లపాలెం చెరువులో మహిళ మృతదేహం

సాక్షి, గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెం చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేశారు. మృతురాలు గన్నవరానికి చెందిన గోచిపుట పుష్పలతగా గుర్తించారు. చెరువు దగ్గర ఆమె హ్యాండ్‌బ్యాగ్‌, స్కూటీని కూడా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పుష్పలతకు ఏలూరుకు చెందిన అనిల్‌కుమార్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో పుష్పలత గన్నవరంలో తల్లి దగ్గర ఉంటూ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నిన్న సాయంత్రం ఫ్రెండ్‌ని కలిసివస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిన పుష్పలత... ఉదయం మర్లపాలెం చెరువులో మృతదేహంగా తేలింది. పుష్పలత మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబసభ్యలను విచారిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement
Back to Top