కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కే ట్యాక్స్‌ పేరుతో కోడెల కుటుంబం ఐదేళ్లపాటు విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దందాలు, అక్రమ వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top