మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్‌ భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ నెల 21న మేడిగడ్డ వద్ద గల కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం కీలకం కావడంతో ఆ రాష్ట్ర సీఎంను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top