టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌)ను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ప్రభుత్వపరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను తుచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top