దీప్తిశ్రీ కిడ్నాప్‌ మిస్టరీ: రంగంలోకి ధర్మాడి సత్యం బృందం

కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. 48 గంటలైన చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. సవతి తల్లి శాంతికుమారినే దీప్తిశ్రీని హత్యచేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సవతి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో శాంతికుమారి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీప్తిశ్రీని గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె విచారణలో వెల్లడించినట్టు సమాచారం. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు.  చిన్నారిని తానే చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ధర్మాడి సత్యం బృందం కూడా రంగంలోకి దిగి ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపడుతోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top