వైఎస్ జగన్ కు మద్దతుగా మక్కాలో ప్రత్యేక ప్రార్థనలు

ఆంధ్రప్రదేశ్లో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సాయం మరచిపోలేరు అనడానికి ఈ కార్యక్రమమే ఒక నిదర్శనం. అందరూ ఉన్నత చదువులు చదువుకునే విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ఎంతోమంది విద్యార్థులకు మంచి జీవితాన్ని ప్రసాదించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ విద్య వరకూ చదువుకునేందుకు ఈ పథకం ద్వారా వైఎస్ అవకాశం కల్పించారు. ఈ పథకంతో ఉన్నత చదువులు చదువుకొని సౌదీ అరేబియాలోని పలు ప్రముఖ సంస్థల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తోన్న కొందరు ప్రవాసాంధ్రులు వైఎస్సార్ కుటుంబం మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మక్కాలో ఉండే కాబాలో ఫోటోలతో ప్రార్థన చేయడం నిషేధం ఉన్నా, ఆ రాజన్న ప్రవేశపేట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్తో చదువుకోని, జీవితంలో స్థిరపడ్డాము కాబట్టి గుండెల నిండా పెద్దాయనను నింపుకొని ప్రార్థనలు చేశాము అని 'జగన్ కోసం టీమ్' సభ్యుడు షేక్ సలీం చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top