ఐపీఎల్ వేలం: హనుమ విహారి జాక్‌పాట్‌

పదకొండు సీజన్‌లుగా అలరించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పన‍్నెండో ఏడాదిలోకి ప్రవేశించింది. ఐపీఎల్‌–12 సీజన్‌ కోసం ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. మంగళవారం ప్రారంభమైన వేలం క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించనుంది.  తమ అభిమాన ఆటగాడు ఏ జట్టు సొంతం అవుతాడో, తమ అభిమాన జట్టు కొత్త స్వరూపం ఎలా ఉండబోతోందో అన్న ఆలోచన రాక మానదు. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా పూర్తి స్థాయిలో జట్టును ఎంచుకోవాల్సి ఉండటంతో నాణ్యమైన, మేటి ఆటగాళ్లను చేజిక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో బరిలో దిగనున్నాయి. ఈ వేలంలో ఏమైనా జరగొచ్చు. ఎన్నాళ్ల నుంచో తమ దృష్టి ఉన్న ప్రత్యర్థి జట్టులోని కీలక ఆటగాళ్లను తన్నుకుపోయేందుకు ఫ్రాంచైజీలకు ఇదే మంచి అవకాశం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top