బంజారాహిల్స్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
రాజధానిలోని స్టార్ హోటళ్లు అడ్డాగా నటీమణులను ట్రాప్ చేసి వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నడిపించే జనార్దన్‌రావు అలియాస్ జానీ నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌పై దాడి చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. విటుడిగా వచ్చిన ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్‌ను సైతం పట్టుకొని, భోజ్‌పురి నటిని రెస్క్యూ చేశారు. గతేడాది డిసెంబర్‌లోనూ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం బంజారాహిల్స్, పంజగుట్ట పరిధుల్లో రెండు స్టార్ హోటళ్లపై ఏక కాలంలో దాడులు చేసింది. ఇద్దరు పాత్రధారుల్ని అరెస్టు చేసి తెలుగు సినీ, బెంగాలీ టీవీ రంగాలకు చెందిన ఇద్దరు నటీమణుల్ని రెస్క్యూ చేసింది. ఈ కేసులోనూ జానీ వాంటెడ్‌గా ఉన్నాడు. సినీ అవకాశాల పేరుతో వర్ధమాన తారలను ట్రాప్ చేసే జానీ... వారి ఫొటోలను వాట్సప్‌లో విటులకు షేర్ చేసి, స్టార్ హోటళ్లలో దందా నడిపించేవాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు