ప్రణయ్‌ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురికి హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలపై గత ఏడాది సెప్టెంబర్‌ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలు బెయిల్‌ కోసం రెండు నెలల క్రితం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top