కాలువ శ్రీనివాస్ నామినేషన్...పేజీలో కొట్టివేతలు
మంత్రి కాల్వ శ్రీనివాస్ నామినేషన్‌పై హై డ్రామా నెలకొంది. రాయదుర్గం టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన కాలువ శ్రీనివాస్.. ఒక పేజీలో కొట్టివేతలతోపాటు అసంపూర్తిగా సమాచారం ఇచ్చారు. దీంతో కాలువ శ్రీనివాస్ నామినేషన్‌ను తిరస్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డి ఎన్నికల అధికారిని కోరారు. ఈ సందర్భంగా తీవ్ర అసహనానికి గురైన మంత్రి కాలువ రాయదుర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హల్చల్ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిపైకి దౌర్జన్యానికి దిగారు. అభ్యంతరాలపై సమాధానం దాటవేస్తూ సాక్షి మీడియాపై అక్కసును వెళ్లగక్కారు. నామినేషన్ పరీశీలన కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆయన.. నామినేషన్ ఆమోదించేలా ఉన్నతాధికారులపై ఒత్తిళ్లకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు