హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
భాగ్యనగరంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్థభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చిచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మెహదీపట్నం, భేగంపేట, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ, ఖైరతాబాద్‌లో 8.6 సెం.మీల వర్షపాతం నమోదైంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు