అనంతపురంలో భారీ వర్షం,ఇళ్లలోకి నీరు

జిల్లాలోని తాడిపత్రి, గుత్తిలలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా తాడిపత్రిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోని ఇ‍ళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఉప్పు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుత్తి- ఆదోని మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి చెరువుకు గండిపడటంతో పెద్ద మొత్తంలో నీరు వృధాగా పోతోంది. కంబదురు మండలం కొత్తపల్లి వద్ద వంతెన కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలోని లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే పెద్దారెడ్డి పరిశీలించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top