పిచ్చి మాటలు మాట్లాడితే నీ నాలుక చీరేస్తా బిడ్డా
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ నాలుక చీరేస్తా బిడ్డా జాగ్రత్తా.. అంటూ రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆపద్దర్మ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. గజ్వేల్లో నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన సభకు హాజరైన ఆపద్ధర్మ మంత్రి హరీష్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో అంతర్యుద్ధం జరుగుతోందని, ఏ క్షణంలోనైనా చీలిక రావచ్చని రేవూరి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు గడిచినా మంచి నీళ్లు ఇయ్యని దిక్కుమాలిన వారంటూ కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో టీడీపీ కనుమరుగు అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రతాప రెడ్డి, నర్సారెడ్డిలు జోగడు బాగాడు లెక్క తయారయ్యారని విమర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు