హరీశ్‌రావుపై వెల్లువెత్తిన అభిమానం!

రాజకీయాల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన టీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుపై అభిమానం వెల్లువెత్తింది. తెలంగాణ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిన ఈ టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌కు అభినందనలు తెలిపేందుకు ఆయన అభిమానగణం తరలింది. వందలాది వాహనాల్లో వేలాదిగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆయన నివాసానికి తరలిరావడంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్లు కిక్కిరిసాయి. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ జామ్‌ అయ్యాయి. అయితే టీఆర్‌ఎస్ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్‌ ప్రెసిడెంట్‌) కేటీఆర్‌ నియమితులైన నేపథ్యంలో హరీష్‌ అభిమానులు వేలాదిగా తరలిరావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top