లంకాధీశుడు
శ్రీలంక అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స (70) విజయం సాధించారు. తన ప్రత్యర్థి ప్రేమదాస రణసింఘేపై దాదాపు 13 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లంకకు ఏడో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న గొటబాయ ఆ పదవిలో అయిదేళ్ల పాటు కొనసాగనున్నారు. లంకలోని ప్రాచీన నగరం అనురాధపురంలో ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజపక్స కుటుంబం నుంచి 2005–15 మధ్య మహింద రాజపక్స అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తమ్ముడే ఇప్పుడీ ఎన్నికల్లో గెలుపొందిన గొటబాయ. వివాదాస్పదుడిగానూ, ఎల్టీటీఈ తీవ్రవాదులను అణచివేసిన మిలిటరీ వార్ హీరోగానూ గొటబాయకు పేరుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు