ఆమె ఆత్మహత్య ఉదంతం కదిలించింది

‘నీట్‌’లో సరైన ర్యాంకు రాలేదన్న కారణంతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్న జస్లిన్‌ కౌర్‌ ఉదంతంపై నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ స్పందించారు. ఆమెను ‘డాటర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ అంటూ సంబోధించిన ఆయన.. విద్యార్థిని అకాల మరణం తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించారు. బుధవారం కొత్వాల్‌ విడుదల చేసిన ఆడియోలోని అంశాలు ఇలా.. ‘మెడికల్‌ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు రాలేదనే కారణంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. తన అత్యంత విలువైన జీవితాన్ని చాలా చిన్న వయసులోనే కోల్పోవడం నా గుండెను కదిలించింది. ఈ నష్టాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఆమె కుటుంబీకులకు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. వివిధ రంగాల్లో నెలకొన్న అనారోగ్యకరమైన పోటీ చిన్ని హృదయాలపై ఎంతటి ప్రభావం చూపుతోందో, ఎంత ఒత్తిడికి గురిచేస్తోందో సమాజం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top