బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. డ్రైవర్ సాహసం

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా బస్సు డ్రైవర్ దాదాపు కిలోమీటర్ వరకు నడిపించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణనష్టం సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు ఆయన ధైర్యసాహసాలు ప్రదర్శించినట్లు సమాచారం. యాత్రికుల ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లారని ఉగ్రదాడిలో గాయపడ్డ మహారాష్ట్రకు చెందిన యాత్రికురాలు భాగ్యమణి తెలిపారు. చనిపోయిన ఏడుగురు యాత్రికులలో తన మరదలు ఉన్నారని కన్నీటి ఆమె పర్యంతమయ్యారు. అమర్‌నాథ్ తర్వాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకోవాలకున్నామని, అంతలోనే ఈ ఘాతుకం జరిగిపోయిందని ఆమె వాపోయారు.

Title: 
బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. డ్రైవర్ సాహసం

మరిన్ని వీడియోలు

Back to Top