కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
దిశ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు సరిగా స్పందించలేదు. మా పరిధిలోకి రాదంటూ వారిని అటూ ఇటూ తిప్పారు. అవమానించారు. బాధితురాలు ఎవరితోనో వెళ్లిపోయిందంటూ నీచంగా మాట్లాడారు. రెండు మూడు పోలీసు స్టేషన్లకు వారిని తిప్పారు. ఒకవేళ వెంటనే పోలీసులు స్పందించి ఉంటే బాధితురాలి ప్రాణం నిలిచేది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. అందుకే జాతీయ రహదారుల వెంట మద్యం అమ్ముతున్నారు. ఈ ఘటనలో నిందితులు ఫుల్లుగా తాగి ఉన్నారు. మద్యం వల్లే నేరాలు పెరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఙ్ఞప్తి చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి