ఢిల్లీ హైకోర్టులో సుజనాకు చుక్కెదురు

బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్‌ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో ఫిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్‌ 3న ఈడీ ముందు వ్యక్తిగతంగా సుజనా చౌదరి హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top