యువతిపై దాడి..వైరల్ వీడియో
ఢిల్లీకి చెందిన పోలీస్ అధికారి కొడుకు ఓ యువతిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అంతేకాకుండా ఈ తతంగాన్నంతా తన స్నేహితుడితో వీడియో తీయించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. దాడి చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసు నార్కోటిక్ విభాగం ఏఎస్సై అశోక్ సింగ్ తోమర్ కుమారుడు రోహిత్ తోమర్గా గుర్తించారు. ఐపీసీ సెక్షన్ 354, 506 కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు