259వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 259వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగే మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అక్కయ్య పాలెం, దొండపర్తి జంక్షన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు పాదయాత్ర సాగనుంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top