మైదానంలో క్రికెట్‌ ఆడుతూ.. కుప్పకూలాడు!

నగరంలోని జీహెచ్‌ఎంసీ మైదానంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఓ ప్లేయర్ హఠాన్మారణం చెందాడు. హెచ్‌ఎస్‌బీసీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రకు చెందిన వీరేంద్ర నాయక్.. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి చెన్నై గ్రౌండ్‌లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసిన వీరేంద్ర నాయక్ 55 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత గ్రౌండ్ నుండి విశ్రాంతి గది వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. హుటాహుటిన అతన్ని స్థానిక ఆస్పత్రి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top