లష్కరే ఉగ్రవాదులే దాడి చేసింది

దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడిని ఎవరు చేశారనే విషయాన్ని జమ్మూకశ్మీర్‌ భద్రతా బలగాలు వెల్లడించారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. ఈ దాడి వ్యూహం పన్నిని కీలక సూత్రదారుడు అబూ ఇస్మాయిల్‌ అనే పాకిస్థాన్‌ ఉగ్రవాది అని కశ్మీర్‌ ప్రధాన పోలీసు అధికారి మునీర్‌ఖాన్‌ వార్తా సంస్థకు వెల్లడించారు. ఇస్మాయిల్‌తో సహా మరో ముగ్గురు ఈ దాడులకు పాల్పడినట్లు వివరించారు. ఈ సందర్భంగా అతడి ఫొటోను మీడియాకు విడుదల చేశారు.

Title: 
లష్కరే ఉగ్రవాదులే దాడి చేసింది

మరిన్ని వీడియోలు

Back to Top