పటేల్‌ సాహసంతోనే తెలంగాణ ఏర్పాటు: యోగి

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సాహసంతోనే తెలంగాణ ఏర్పడిందని ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి వచ్చిన యోగి ఆదిత్యానాథ్‌ మాట్లాడుతూ..వల్లభాయ్‌ పటేల్‌ చొరవ లేకుంటే నిజాం ఇక్కడి నుంచి పారిపోయేవాడు కాదన్నారు. కానీ కాంగ్రెస్‌ వల్లభాయ్‌ని విస్మరించిందని విమర్శించారు. మోదీ ప్రధాన మంత్రి అయ్యాక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండు కోట్ల మందికి ఇండ్లు కట్టించారని వెల్లడించారు. ఇప్పటికీ తెలంగాణ ఇండ్లులేవు..మరుగుదొడ్లు కట్టలేదని, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు దొందూదొందేనని అన్నారు.
 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top