పవన్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పవన్‌ కల్యాణ్‌తో కలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్‌ను విమర్శిస్తున్నారంటూ చంద్రబాబు తెగ బాధపడిపోయారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పవన్‌తో కలిసి పోటీ చేస్తారనే ప్రశ్నకు చంద్రబాబు నవ్వుతూ సమాధానం దాటవేశారు. పవన్‌తో కలిసి పోటీ చేయనని చంద్రబాబు చెప్పకపోవడం గమనార్హం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top