కేంద్రం ఆపమంటే టెండర్లు ఆపేస్తా

పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. పోలవరం టెండర్లు వద్దంటే కేంద్రానికి వదిలేసి ఓ నమస్కారం పెడతానంటూ ఆయన గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో అన్నారు. పోలవరంపై అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘కేంద్రం నిర్ణీత గడువు పెట్టుకుని పూర్తి చేస్తామంటే రేపు ఉదయమే ప్రాజెక్ట్‌ను కేంద్రానికి అప్పగిస్తాం. పోలవరం టెండర్లు ఆపాలంటూ కేంద్రం లేఖతో గందరగోళం ఏర్పడింది. కేంద్ర మంత్రితో చర్చించాకే టెండర్లకు పిలిచాం. కేంద్రం ఆపమంటే పోలవరం టెండర్లు ఆపేస్తా. ప్రాజెక్ట్‌ పనులు ఆరు నెలలు ఆగిపోతే మళ్లీ మొదలుపెట్టడం కష్టం అవుతుంది. అందుకే పోలవరంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నేతలను కోరాను. బీజేపీ మిత్రపక్షం కాబట్టే సహనంతో వ్యవహరిస్తున్నాం...లేకుంటే మరోలా ఉండేది. పోలవరం సమస్య ప్రభుత్వం వద్ద ఉందో, అధికారుల వద్ద ఉందో అర్థంకావటం లేదు.కేంద్రం సహకరిస్తే...లేకుంటే మాకు కష్టం మిగులుతుంది.’ అని వ్యాఖ్యానించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top