అన్నం పెట్టిన ఇంటికే కన్నం.. 18నెలల జైలు శిక్ష

అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టాడు. తెలివిగా దోచుకున్నానని సంబరపడి అడ్డంగా దొరికిపోయాడు. విలాసవంతమైన జీవితం గడపాలన్న ఓ పనివాడి దుర్బుద్ధి అతడిని జైలు పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన రస్సెల్‌ లిబ్రండ అక్కడి హాత్రో విమానాశ్రయంలోని ‘‘బ్రేజన్‌ బూట్స్‌’’ దుకాణంలో పనిచేసేవాడు. కానీ, కొన్ని నెలల క్రితం పనిమానేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత షాపు యాజమాన్యం నగదు లావాదేవీల్లో పెద్ద మొత్తం తేడాను గమనించారు. ఇందుకు గల కారణం తెలుసుకోవటానికి సీసీ కెమెరాలను పరిశీలించి చూడగా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. అక్కడ పని మానేసి వెళ్లిపోయిన లిబ్రండ డబ్బు దొంగలించటం వారికంట పడింది. డబ్బుల కౌంటర్‌ దగ్గర ఉండే లిబ్రండ కస్టమర్లు ఇచ్చిన నగదును(ముఖ్యంగా పెద్దనోట్లను) మడతపెట్టి అటు ఇటు చూసి టక్కున జేబులో పెట్టుకునే వాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top