క్రికెట్‌ యాడ్‌పై దుమారం

‘మూర్ఖుడా, దద్దమ్మా, హాస్యము తెలియని వెర్రి వెంగలప్ప, అభిరుచి లేనివాడా! భిన్న సంస్కృతులు, భాషలు కలిగిన గొప్ప దేశం పట్ల గౌరవ లేకుండా క్రికెట్‌ పేరు మీద తప్పుడు జాతీయవాదాన్ని రుద్దుతున్నావు’ అంటూ ప్రముఖ బెంగాలీ చలనచిత్ర నిర్మాత సృజిత్‌ ముఖర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ‘బెంగాలీ సంస్కృతిని, రవీంద్రుడి కవిత్వాన్ని అవమానించడం అంటే అది కచ్చితంగా ఓ జాతి పట్ల విద్వేషం వెదజల్లడమే అవుతుంది’ అంటూ జర్నలిస్ట్‌ సౌమ్యజిత్‌ మజుందార్‌ విమర్శించారు. ‘నేనొక బెంగాలీని, బెంగాలీ సంస్కృతిని గౌరవిస్తాను. మా ఆత్మ అయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కవిత్వాన్ని అవమానించావు, మేము దేవుడికి నైవేద్యంగా పెట్టే తిలర్‌ నాడును అవమానించావు. ఇందుకు క్షమాపణలు చెప్పాలి’ అని మరొకరు, ‘బెంగాలీలు భారతీయులు కాదా, వేరుగా చూసినందుకు క్షమాణలు చెప్పాలి లేదా కోర్టుకు వెళతాం’ అని ఇంకొకరు, అసలు డాబర్‌ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలన్న హాష్‌ట్యాగ్‌తో మరికొందరు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top