మొరదాబాద్‌లో పోలింగ్‌ అధికారిపై దాడి

యూపీలో మంగళవారం లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మొరదాబాద్‌లోని బిలారిలో ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద బీజేపీ కార్యకర్తలు ప్రిసైడింగ్‌ అధికారిని తోసివేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను ప్రిసైడింగ్‌ అధికారి కోరారని ఆయనపై దాడికి తెగబడ్డ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. యూపీలో బీఎస్పీతో పొత్తుతో పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గుర్తు సైకిల్‌ కావడం గమనార్హం.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top