సీతపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
రుద్రాపూర్ : దసరా సమయంలో ఉత్తర భారతంలోని అన్ని గ్రామాల్లోనూ దాదాపు రామ్‌లీలా నాటకం వేస్తారు. సీతారాముల గొప్పతనం నేటి తరానికే తెలియజేసేందుకే ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఉత్సవాల్లో భాగంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించిన ఓ బీజేపీ ఎమ్మెల్యే సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీత మేరీ జాన్’. అంటూ అసభ్యకరంగా సంభోదించి చిక్కుల్లో పడ్డారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్.. గత ఆదివారం నియోజకవర్గంలో ప్రదర్శించిన రామ్‌లీలా నాటకంలో రావణాసురుడు పాత్ర వేశారు. సీతా దేవి, రావణునికి మధ్య వచ్చే సన్నివేశంలో భాగంగా ‘ సీతా మేరీ జాన్’ అంటూ సీతా దేవిని సంభోదించారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వారు. అయితే నాటక నిర్వాహకులు మాత్రం అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ ఆయన అలాగే సంభోదించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు