పరిటాల శ్రీరాం భార్య జ్ఞానకు చేదు అనుభవం
ముత్తవకుంట్ల. మంత్రి పరిటాల సునీతకు సెంటిమెంట్ గ్రామం. ఆమె సొంతూరు వెంకటాపురం గ్రామానికి కూతవేటు దూరంలో ఉందీ పల్లె. సునీత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ.. ముఖ్యమైన కార్యక్రమం ఏది చేపట్టినా ఇక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. ఇలాంటి సెంటిమెంట్ గ్రామం నుంచే తిరుగుబాటు మొదలైంది. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తొలి రోజే(ఈ నెల 13) మంత్రి పరిటాల సునీతను నిలదీసిన గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు, తాజాగా ఆదివారం టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాం సతీమణి జ్ఞాన ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఆమెనూ అడ్డుకున్నారు. తమ కాలనీకి ఏం చేశారని ఓట్లు వేయాలని నిలదీశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు