హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహర్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అజహర్ 74 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 223 ఓట్లు పోల్ కాగా, అజహర్‌కు భారీ స్థాయిలో ఓటింగ్ పడింది. అధ్యక్ష పదవి కోసం అజహరుద్దీన్‌తో పాటు దిలీప్ కుమార్, ప్రకాష్ చంద్ జైన్లు పోటీ పడ్డారు. అజహర్‌కు 147 ఓట్లు పడగా, ప్రకాశ్ జైన్‌కు 73, దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు పడ్డాయి. అయితే హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్‌కు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ అజహర్ ఘన విజయం సాధించడంతో అతని కల ఫలించినట్లయ్యింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు