ఆటవిక రాజ్యానికిదే నిదర్శనం..!

 ఆటవిక రాజ్యం అని గతంలో పేరుపడ్డ బిహార్‌లో మళ్లీ అలాంటి పరిస్థితులే దాపురించాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ రక్షకభటులకే రక్షణ లేకుండా పోయింది. రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తున్న ఆటోవాలాను అడ్డుకున్నందుకు విధుల్లో ఉన్న ఓ పోలీసుపై రౌడీయిజం చేశారు. ఆటోవాలా అతని స్నేహితులు దుర్భాషలాడుతూ సదరు పోలీస్‌ కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన ముజఫర్‌పూర్‌లోని అఘోరియా చౌక్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, రౌడీ మూక తాట తీసేందుకు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top