బైక్‌ను ఢీకొట్టిన ఆడికారు
ఒళ్లు గగుర్పొడిచే రీతిలో జైపూర్‌లో జరిగిన ఓ ప్రమాదం విజువల్స్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. జైపూర్ సిటీలోని జేడీఏ సర్కిల్లో శుక్రవారం చోటుచేసుకున్నఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. సిగ్నల్ క్రాస్ చేస్తున్న ఓ టూ వీలర్‌ను వేగంగా దూసుకొచ్చిన ఆడికారు ఢీకొట్టింది. దీంతో టూ వీలర్ పైన ఉన్న వ్యక్తి అమాంతం గాల్లోకి లేచి 30 అడుగుల దూరంలో పడ్డాడు. ఇక కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారీకాగా అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు