ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
ఇన్నాళ్ల నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20, 010 వేల పోస్టుల నియమకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. త్వరలో ఎన్నికలు సమీపించనుండటంతో టీడీపీ ప్రభుత్వం యువతను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా గ్రూప్ 1, 2, 3, డీఎస్సీతో పాటు పోలీస్ శాఖల్లో పోస్టుల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం జరపనున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు